Tuesday, 28 October 2014

మాయాజాలం , మనుష్యలోకం(నారద ముని, విష్ణుమూర్తి మద్య సంభాషణ )

నారాయణ , నారాయణ అంటూ నారద ముని విష్ణుమూర్తి వద్దకు వచ్చి , యేమని చెప్పెదను కలియుగము వింత అనగా వివరముగా తెలియచేయి అని విష్ణుమూర్తి అంటే , నారదముని మొదలు పెట్టినాడు కలియుగ వింత ! పూర్వము ధర్మరాజు జూదము పాచికలతో ఆడి గెలవలేక తమ్ములను , భార్యను కుదువ పెట్టినాడు కౌరవులకు . నేడు సరి భార్య , భర్త, అన్న , తమ్ములు కలిసి అధియోదో అట్లాంటిక్ సిటీ లాంటి వింత వింత సిటీలు ఉన్నాయంటా జూదమాడడానికి ! అక్కడ ఓడితే మరి కుదవ పెట్టడానికి ఏమిలేదు నీ దగ్గరకు ప్రాదేయపడుకుంటూ వస్తారు తలనీలాలు తప్ప ఏమిలేవని , నీవే శరణం వారికి !
యింతేన ప్రభు యింకా ఉంది చెప్పడానికి , తెలియచేయి కుతూహలముగా ఉంది నారదా ! అని విష్ణువు. అనగా నారదముని అనెను ఆడ , మగ తేడా తెలియటము లేదు ముందు నుండి చూస్తే తప్ప , పంచె కట్టు పురుషుడు , చీరె కట్టే ఆడది కరువై పొయినారు ఆంధ్రులలో ( భారత దేశంలో ) . లక్ష్మి దేవిని , నిన్ను చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది మీ జంట ! అక్కడేమో భార్య , భర్త సమానహక్కులని హైరానా పడిపోతున్నారు , కుదరకపోతే నీ దారి , నా దారి ( విదాకులట ) వేరంటారు మరి , !
యిక వాహనాలు అంటావా ప్రభో , మనుష్యులు ఎంత మంది ఉన్నారో , అన్ని వాహనాలు ఉన్నాయి . మనము ఆకాశములో పుష్పకవిమానములో తేలినట్లే వారు కూడా పక్షి లాంటి వాహనము ( విమానము అంటా ) అందులో విహరిస్తున్నారు మరి ! బ్రహ్మ శ్రుష్టించిన మానవుల తెలివికి అబ్బుర పడిపోయాను నేను , నారాయణ . నాకు చూడాలని ఉన్నదీ కలియుగ వింత లోకం !
వెళ్దామా మరి , నీవు నాలుగు చేతులు , నేను తుంభురము పట్టుకొని వెళ్తే , ఇక సరి మనని అదేదో అమెరికాలో హలవిన్ కాస్ట్యూమ్ , ఇండియాలో హోలీ సంబరానికి వచ్చారు అనుకుంటారు ప్రభో , మనము కూడా సాధారణ మనుష్యుల దుస్తులు ధరించి కలియుగ వింత లోకం చూసి నవ్వుకొని వస్దాము కాసేపు !
మన బిడ్డలు కద , భక్తితో ప్రార్ధించిన కష్టాలలో కాపాడి ఆదుకోవటము మన కర్తవ్యము కద నారద , సరిగ్గ విన్నవించారు ప్రభో , భక్తితో , ముక్తిని పొందెదవు మానవా !

No comments:

Post a Comment